జిల్లా మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మిషన్ శక్తి వంద రోజుల స్పెషల్ కార్యక్రమం మరియు మాదక ద్రవ్యాలు నిర్మూలన సంయుక్త అవగాహన కార్యక్రమం లో భాగంగా స్ఫూర్తి డిగ్రీ కళాశాల,కోతులపూర్ జడ్పీహెచ్ఎస్ ,మామిడిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్య నిర్మూలనకు అందరు కృషి చేయాలని, హెల్ప్ లైన్ నంబర్స్ 100,181,1098 గురించి ,లింగ సమానత్వం గురించి, ఆరోగ్య విద్య ఉద్యోగ అభివృద్ధి గురించి అధికారులు తెలియజేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో అందరి బాధ్యత వహించాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా ఆడపిల్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పాఠశాల ఆవరణలో మొక్కలను నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో DLSA జడ్జి రమేష్ , డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కె.లలిత కుమారి,ఎక్సైజ్ శాఖ అధికారి నవీన్ చంద్ర మరియు అధికారులు,మహిళా ps CI,సీనియర్ సిటిజన్ అధికారి వెంకటేశం,జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయ కర్త పల్లవి, ప్రిసిపల్స్,పంచాయతీ సెక్రటరీలు పాఠశాల సిబ్బంది అంగన్వాడీ టీచర్స్ ఆశ తదితరులు పాల్గొన్నారు.