పోలీస్ కమిషనర్ పేరిట 80 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగినిని మోసం చేసారు సైబర్ చీటర్స్. 80 ఏళ్ల సదరు వృద్ధ మహిళ మొబైల్ నెంబర్ పై హైదరాబాద్ నుండి డ్రగ్స్ ఢిల్లీ కు పర్సల్ అవుతున్నాయంటూ సైబర్ నేరగాళ్లు మొదట అఆమేను భయపెట్టారు. అయితే సదరు వృద్ధురాలిపై కేసును నమోదు కాకుండా ఉండాలంటే… ఆమె అకౌంట్ లో ఉన్న నగదు మొత్తం తమకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు.అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వేరిఫికేషన్ చేసిన తర్వాత డబ్బులు తిరిగి ఆమె అకౌంట్ కు పంపిస్తామంటూ చెప్పారు సైబర్ నేరగాళ్లు. దాంతో పోలీస్ కమిషనర్ నుండే ఫోన్ వచ్చిందనుకుని నమ్మిన బాధిత వృద్ధురాలు.. ఆమె అకౌంట్ లో ఉన్న 22 లక్షలు సైబర్ చీటర్స్ అకౌంట్ కు పంపింది. అనంతరం ఈ విషయాన్ని వృద్ధురాలు తన కొడుకుకు చెప్పడంతో.. జరిగిన మోసాన్ని గ్రహించిన ఆమె కొడుకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
09/08/2024
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ లాంఛ్.. స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన తారక్!
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇవాళ పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ ప్రారంభ వేడుక జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. తారక్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు.
ప్రస్తుతం ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. #ఎన్టీఆర్‌నీల్ హ్యష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ‘ఎన్టీఆర్ 31’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మూవీని ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత (AAP leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునిచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు సూచించింది. పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో 17 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న సిసోడియాకు భారీ ఊరట లభించినట్లైంది
కాగా, మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 17 నెలల తర్వాత ఆయనకు ఇప్పుడు ఉపశమనం లభించింది.
నూతన మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాను పలుమార్లు విచారించిన సీబీఐ.. 2023, ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆయన జైలు జీవితాన్నే గడుపుతున్నారు. విచారణ సమయంలో సీఎం పదవిని ఆశజూపి ఆప్‌ను లొంగదీసుకొనేందుకు బీజేపీ కుట్రకు తెర తీసిందని అరెస్టుకు ముందు సిసోడియా ఆరోపించారు. ఆప్‌ను వీడాలని సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేశారని 2022 అక్టోబర్ 17న సిసోడియా తెలిపారు. బీజేపీలోకి వస్తే, ఢిల్లీ సీఎం పోస్టు ఇస్తామని ఆఫర్ చేశారని, లేకుంటే జైలుకు పంపిస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఏడాదికి పైగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నా, బీజేపీ బెదిరింపులకు వెరవకుండా సిసోడియా కోర్టుల్లో తన పోరాటాన్ని కొనసాగించారు. ఆ పోరాట ఫలితమే ఇవాళ సుప్రీం తీర్పు అని ఆప్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ఇకపై తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్‌కు పర్యాయపదంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిచ్చారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు.
ఇప్పటి వరకు తాము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్.. అని పిలుద్దాం..’ అని చెప్పారు.
ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు.
హైదరాబాద్ అభివృద్ధిలో భాగంకండి..
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు.
ఎన్నో ఏండ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు టెక్నాలజీ సెంటర్‌గా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుందని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు టైర్-2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేయటంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఎంచుకున్నారని, ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.
అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా.. ఈ అలయెన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది చివర్లో వేగాస్‌లో ఐటీ సర్వ్ అలయెన్స్ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు హాజరవుతారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని అలయెన్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మార్గదర్శకాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అర్హుల ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్‌కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఈ కమిటీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డు లబ్దిదారుల ఎంపికపై అధ్యయనం చేసి విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్దిదారులకే ఉచిత ఆరోగ్య వైద్య సేవలు (హెల్త్ కార్డు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రేషన్ కార్డు, హెల్త్ కార్డు లింక్‌ను తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఏకంగా 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు హాకీ ఇండియా నగదు బహుమతి ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్యం సాధించిన జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.15 లక్షలు చొప్పున నగదు బహుమతి అందించనున్నట్టు వెల్లడించింది. ఇక జట్టులోని సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.5 లక్షలు అందజేయనున్నట్టు తెలిపింది.
కాగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌పై భారత హాకీ జట్టు 2-1 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో భారత జట్టు పతకాన్ని ముద్దాడినట్టయింది.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన జట్టుపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆటగాళ్లను మెచ్చుకున్నారు. వరుసగా రెండవ ఒలింపిక్‌లోనూ పతకం గెలవడం అసాధారణమైన విజయమని కొనియాడారు. ఈ నగదు బహుమతి క్రీడాకారుల ప్రయత్నాలకు ఒక ప్రశంస మాత్రమేనని దిలీప్ టిర్కీ వ్యాఖ్యానించారు. ఈ విజయం ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కృషి, సంకల్పానికి నిదర్శమని అన్నారు.