మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలోని దేవి నగర్ లో సిఐ శేఖర్ ఇంట్లో బర్త్ డే పార్టీ జరుగుతుండగా ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిఐ శేఖర్ ఇంట్లో బర్త్ డే వేడుకల కోసం 30 మంది స్నేహితులు అతడి ఇంటికి వెళ్ళారు. 30 మందిలో 10 మంది పోలీసులు కూడా ఉన్నారు. బర్త్ డే పార్టీ జరుగుతుండగా మూడవ అంతస్తు నుండి బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ కిందపడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో ఘటన స్థలంలోనే అతడు మృతి చెందాడు. డిన్నర్ చేస్తుండగా మూడవ అంతస్తు నుండి అతడు పడిపోయినట్టు సమాచారం. పార్టీ ఇచ్చిన శేఖర్ రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు 194 బిఎఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూకట్ పల్లి పోలీసులు తెలిపారు.
05/08/2024
దేశీయ స్టాక్ మార్కెట్ అంచనా వేయడానికి ఉపయోగపడే బారోమీటరయిన ‘విక్స్’(VIX) 22కు పెరిగింది. ఇది 2015 నుంచి ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు కూడా 3శాతం పతనమయ్యాయి. మదుపరుల రూ. 17 లక్షల కోట్లు ఆవిరయిపోయాయి. ఇదో రకంగా సోమవారం అల్లకల్లోలం(Monday Mayhem) అనొచ్చు. అమెరికాలో మాంద్యం ఛాయలు పొడసూపడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అధోముఖం పట్టాయి. మధ్యాహ్నం 11.20 కు సెన్సెక్స్ 2.83 శాతం పతనమై 78693 వద్ద, నిఫ్టీ 2.8 శాతం పతనమై 24025 వద్ద ట్రేడయ్యాయి. దాదాపు 3007 షేర్లు పతనం కాగా, 437 షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. ఇక 82 షేర్లు మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి.
అమెరికా సూచీ నాస్ డాక్ ఫ్యూచర్స్ 2శాతం పతనం కాగా, నిక్కీ 13 శాతం మేరకు పతనమైంది. ప్రస్తుతం మన దేశీయ మార్కెట్లు కరెక్టివ్ ఫేస్ లోకి ప్రవేశించాయనిపిస్తోంది. కంపెనీల రిజల్ట్స్, బడ్జెట్ ప్రకటన, ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు మార్కెట్ పై ప్రభావం చూపాయనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ లో అనిశ్చితి, కరెక్షన్ కు మార్గం సుగమం చేశాయి.
ఇండియా విక్స్(vix) ను మార్కెట్ యాంగ్జయిటీ బారోమీటర్ అని కూడా అంటారు. అది దాదాపు 52 శాతం లేక 22 పాయింట్ల మేరకు పెరిగింది. ఇంది 2015 నుంచి అత్యధిక గణన అనే చెప్పాలి. విక్స్ పెరిగిందంటేనే మార్కెట్ పతనం అని అర్థం చేసుకోవాలి. నిఫ్టీ ఆటో, రియాల్టీ, మెటల్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ సూచీలు 3 శాతం మేరకు పతనమయ్యాయి. కాగా నిప్టీలో హిందుస్థాన్ యూనీలీవర్, టాటా కన్జూమర్ ప్రొడక్ఠ్స్, సన్ ఫార్మా, నెస్లే, బ్రిటానియా లాభపడగా, టాటామోటార్స్, ఓఎన్ జిసి, హిందాల్కో, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ షేర్టు నష్టపోయాయి.
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్
దుందిగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛధనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం దుందిగల్ మున్సిపాలిటీ 27వ వార్డు దుందిగల్ తాండ 2లో కౌన్సిలర్ శంకర్ నాయక్ పాల్గొని పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం వలన లాభాలు తదితర అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించారు.అనంతరం కౌన్సిలర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వలన డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. నాళాలలో వ్యర్థ పదార్థాలను వేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి శాంత ప్రైమరి స్కూల్ టీచర్ పిఎన్ ఆర్ విద్యార్థులు స్థానిక మహిళాలు నాయకులు పాల్గొన్నారు
అర్థరాత్రి రెండు వందల రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ యువకుడి ప్రాణం తీసిన సంఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతం ఉప్పర్‌పల్లిలో జరిగింది. రెండు సంవత్సరాలు కోమాలో ఉండి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కూడా యువకుడి ప్రాణాలు దక్కలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అంజయ్య గౌడ్- వెంకటమ్మ దంపతులకు నలుగురు అమ్మాయిలతో పాటు ఒక కుమారుడు వెంకటేష్ గౌడ్ ఉన్నాడు. కుమారుడు డిగ్రీ చదవిన అనంతరం ఎల్బి నగర్లో ఉంటూ ఎస్ఐ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు పాకెట్ మనీ కోసం రాత్రి సమయంలో వెంకటేష్ క్యాబ్ నడిపేవాడు. 2022 జులై 31వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో వివేక్ రెడ్డి అనే వ్యక్తి బిఎన్‌రెడ్డి నగర్ నుంచి రాజేంద్రనగర్ మండలం ఉప్పర్‌పల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు.
ఉప్పరపల్లికి చేరుకున్న తరువాత ఛార్జీ రూ.900 అయ్యిందని వెంకటేష్ చెప్పాడు. వివేక్ రెడ్డి ఏడు వందల రూపాయలు అతడి చేతిలో పెట్టి వెళ్తుండగా ఇంకా రెండు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరు గొడవ ప్రారంభమై పెద్దదిగా మారింది. వివేక్ రెడ్డి తన స్నేహితులకు రమ్మని కబురు పంపాడు. వివేక్ రెడ్డి స్నేహితులు అక్కడికి చేరుకొని క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో విచక్షణరహితంగా దాడి చేయడంతో వెంకటేష్ కుప్పకూలిపోయాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగతనం చేస్తుండగా పట్టుకున్నామని వివేక్ రెడ్డి, అతడి స్నేహితులు చెప్పడంతో వెంకటేష్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు మరునాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చేర్పించిన మరుసటి రోజు అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఒక ఎకరంన్నర పొలం అమ్మి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. రెండు సంవత్సరాల నుంచి చికిత్స పొందిన అనంతరం ఇవాళ వెంకటేష్ చనిపోయాడు. పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే ఉంటే బతికి ఉండేవాడని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 2022 ఆగస్టు 8వ తేదీన వార్త పత్రికలు అసలు కథనం రాయడంతో పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాడి చేసిన వారిలో 15 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారంతా కొద్దిరోజులకే బెయిల్‌పై బయటకు వచ్చారు. రెండు వందల రూపాయల కోసం యువకుడి ప్రాణం తీయడంమనేది చాలా దారుణమైన విషయమన్నారు.
ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారయినట్లు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేశారు.
తాజాగా, నంద్యాల, జగ్గయ్యపేటలలో జరిగిన ఘటనలను ఉదాహరిస్తూ ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠా పాలన కనిపిస్తోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. జనం ఛీకొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్ లో ఎటువంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. త్వరలో వైసీపీ ఆఫీసుకు టు-లెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని సెటైర్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ ను అయిదేళ్లలో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది జగన్ కాదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అంటూ దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో ప్రజల నుంచి ప్రతిపక్ష నేతల వరకూ దాడులు, దౌర్జన్యాలు జరగని రోజే లేదని అచ్చెన్న విమర్శించారు.
రెండో వన్డేలో భారత్ ఓటమి
శ్రీలంకతో మూడు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో టీమిండియా 32 పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(40), కామిందు మెండీస్(40) రాణించడంతో 240 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(64), శుభ్‌మన్ గిల్(35), అక్షర్ పటేల్(44) రాణించినా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్పిన్ వలలో చిక్కుకొని భారత బ్యాట్స్ మెన్లు విలవిలలాడిపోయారు. లంక స్పిన్ ధాటికి భారత బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. లంక యువ బౌలర్ జెఫ్రీ వండర్స్ ఆరు వికెట్లు టీమిండియా నడ్డి విరిచాడు. దీంతో అతడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది ఈ సిరీస్ లంక 1-0 తో ముందంజలో ఉంది.