మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈడి సోదాలు చేపట్టింది. 300 కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ పై ఇడి కేసు నమోదు చేసింది. అనర్హులకి రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై ఇడి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా ఇడి విచారణ చేపడుతోంది. హైదరాబాద్ లోని ఆరు ప్రాంతాల్లో ఇడి సోదాలు నిర్వహిస్తోంది. మహేష్ బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్, ఎండి పురుషోత్తం దాస్ తో పాటు సిఇఒ డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు చేపట్టింది. సోలిపురం వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పిల్లల సోదరుల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. రుణాల పేరుతో హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్టుగా ఇడి గుర్తించింది.
31/07/2024
తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రమే నంబర్‌వన్ స్థానంలో ఉందని బిఆర్ఎస్ ఎంఎల్ఎ కెటిఆర్ తెలిపారు. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణ ముందువరుసలో ఉందని, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తలసరి ఆదాయంలో పోటీపడుతున్నామన్నారు. 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.369 కోట్ల మిగులుతో మాకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించిందని పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసన సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. 2022-23 రెవెన్యూ మిగులు రూ.5944 కోట్లు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో రెవెన్యూ మిగులు రూ.209 కోట్లు చూపించడం ఏంటని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.5944 కోట్ల రెవెన్యూ మిగులుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అప్పగించామని స్పష్టం చేశారు.
కెసిఆర్ పాలనలో అప్పులు, రెవెన్యూ బిల్లులకు లోబడి ఉన్నాయని, తాము చేసిన నికర అప్పు రూ.3,85,340 కోట్లు మాత్రమే ఉందని వివరించారు. సంపదను చూస్తేనే అప్పులు ఇస్తారని, జిఎస్‌డిపిలో మన రాష్ట్ర మంచి స్థానంలో ఉందన్నారు. రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ.14.65 లక్షల కోట్లకు ఆదాయం పెంచామని కెటిఆర్ ప్రశంసించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు చెప్పినవాళ్లు, తాము ఇచ్చిన ఆస్తుల గురించి కూడా చెప్పాలని నిలదీశారు. జీతాలు ఇచ్చేందుకు అప్పులు తీసుకొస్తున్నామని, బడ్జెట్లో మాత్రం రెవెన్యూ మిగులు ఉందని ఆర్థిక మంత్రి చెప్పారని, మంత్రుల సభలో చెప్పిన మాటలు తప్పా?, బడ్జెట్లో ఉన్న లెక్కలు తప్పా అని కెటిఆర్ అడిగారు
విమానం సిబ్బంది తీరుతో విసిగిపోయిన ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దైన ఘటన మొరొక్కోలో శుక్రవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, మాంట్రియాల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎయిర్ కెనడా విమానంలో ఓ ప్యాసెంజర్.. ఫ్లైట్ అటెండెంట్‌ను దుప్పటి ఇవ్వమని అడిగారు. ఏసీ కారణంగా చలి ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఫ్లైట్ అటెండెంట్‌కు ప్యాసెంజర్‌కు మధ్య ఊహించని విధంగా వాగ్వాదం తలెత్తింది.
ప్యాసెంజర్‌పై తీవ్ర ఆగ్రహం ప్రదర్శించిన ఫ్లైట్ అటెండెంట్ మర్యాదగా నడుచుకోవాలని హెచ్చరించింది. ఆ తరువాత విమానం దిగిపోవాలని కోరింది. వెనక్కు తగ్గని ప్యాసెంజర్.. కెప్టెన్‌ను పిలుచుకురావాలని ఫ్లైట్ అటెండెంట్‌ను కోరారు. దీంతో, మరింత రెచ్చిపోయిన ఆమె తాను ప్యాసెంజర్ల బెదిరింపులకు లొంగిపోయేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు, ఇతర ప్యాసెంజర్లు కూడా ఫ్లైట్ అటెండెంట్‌తో వాదనకు దిగారు. సిబ్బంది తీరుకు నిరసనగా విమానం నుంచి దిగిపోయారు. దీంతో, ఫ్లైట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
విమాన సర్వీసు రద్దయిన మాట వాస్తవమేనని ఎయిర్ కెనడా ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర సిబ్బంది సాయంతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చామని పేర్కొంది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇందుకు కారణమైన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అంతేకాకుండా, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పింది. ఈ మేరకు ఎయిర్ కెనడా ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.
RRR తర్వాత తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ పెరిగింది. గతంలో మల్టీస్టారర్ సినిమాలంటే ఆమడ దూరం ఉండే హీరోలు మారిన ట్రెండ్‌కు అనుగుణంగా ఇద్దరు ముగ్గురు హీరోలతో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే ఏకంగా తమ స్టార్ డమ్‌ను పక్కనపెట్టి నెగిటివ్ రోల్స్ కూడా ఎంచుకుంటున్నారట.
తాజాగా గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ, తమిళ సూపర్‌స్టార్ సూర్య కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య విలన్ చేయబోతున్నాడనేది తాజా గాసిప్. ఫిలంనగర్‌లో తెగ హల్చల్ చేస్తున్న ఈ ప్రచారంలో ఎంత నిజముందోగానీ, అదే జరిగితే సినిమా అదిరిపోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్లో సూపర్ స్టార్ సూర్యకు తెలుగులోనూ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన నెగిటివ్ రోల్లో నటిస్తారనే టాక్ హీట్ పుట్టిస్తోంది. గతంలో ట్వంటీ ఫోర్ అనే చిత్రంలో ద్విపాత్రిభినయం చేసిన సూర్య ఓ క్యారెక్టర్లో నెగిటివ్ పాత్ర పోషించారు. విక్రమ్ సినిమాలో కూడా చివర్లో రోలెక్స్ పాత్రలో నెగిటివిటీ చూపించారు. ఇక రామ్‌చరణ్‌తో సినిమాలో పూర్తిస్థాయి విలన్‌గా నటిస్తారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, సూర్య కంగువ సినిమాలో నటిస్తున్నారు. ఇది కూడా దాదాపు 14 భాషల్లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నారంటూ కొద్దికాలం నుంచి వార్తలు వస్తున్నాయి కానీ, అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. ఇదే సమయంలో సూర్య విలన్ అంటూ జరుగుతున్న ప్రచారం మరింత హీట్ పెంచుతోంది. రామ్‌చరణ్ త్వరలో బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా. ఇందులో చరణ్‌తో సూర్య ఫైట్ చెయ్యబోతున్నాడనే ప్రచారం. విలన్ అంటే ఇలా ఉంటారా? అనే విధంగా సూర్య క్యారెక్టర్ ఉండబోతుందంటున్నారు. పూర్తిగా పుల్ లెంగ్త్ విలన్ పాత్రలో సూర్య కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఈ న్యూస్ నిజమైతే మాత్రం చరణ్, సూర్య మధ్య ఫైట్ స్క్రీన్ పై అదిరిపోవాల్సిందేనంటున్నారు ఫ్యాన్స్. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
తెలంగాణలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు రాబోతున్నాయా? అసెంబ్లీ పరిణామాలు పరిశీలిస్తే ఇదే సందేహం వ్యక్తమవుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విస్తృత చర్చకు దారితీసిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగిస్తారనే సమాచారంలో నిజమెంత? ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రమాదంలోకి నెట్టేసే సంచలన నిర్ణయానికి ప్రభుత్వం సాహసం చేయగలదా? గత సర్కార్ వల్లే మోటార్లకు మీటర్లు పెట్టాల్సిరావొచ్చే ప్రచారం వెనుక వ్యూహం ఏంటి?
రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెడతారనే ప్రచారంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదయ్ పథకంలో భాగంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న నిబంధన పెట్టింది. ఇలా మీటర్లు పెట్టే రాష్ట్రాలకు సున్నా పాయింట్ ఐదుశాతం అదనంగా రుణాలిస్తామని కేంద్రం అప్పట్లోనే ప్రకటించింది. ఐతే అదనపు రుణాలను ఆశించిన రాష్ట్రాలు అప్పట్లోనే ఈ నిబంధనకు అంగీకరించినా, తెలంగాణలో మాత్రం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఇంతవరకు స్మార్ట్ మీటర్లు బిగించలేదు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు… గత సర్కార్ హయాంలోనే కేంద్రంతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుందనే ప్రభుత్వ వాదన పరిశీలిస్తే త్వరలోనే రాష్ట్రంలోనూ వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడమనే అంశాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేసింది కేంద్రం. ఐతే తెలంగాణలో మాత్రం వ్యవసాయేతర కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు రెడీ అయింది. దీనిపై కేంద్రంతో ఒప్పందం చేసుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ, అధికారపక్షం వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపిస్తూ సభలో సంబంధిత పత్రాలు చూపుతోంది ప్రభుత్వం… దీంతో ఏది నిజమో తెలియకపోయినా… మోటార్లకు మీటర్లు వస్తాయా? అనే భయం మాత్రం రైతుల్లో కనిపిస్తోందంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 జనవరి 4న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ డిస్కంలు మీటర్ల ఏర్పాటుపై ఒప్పందం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అప్పటి అగ్రిమెంట్‌ను అసెంబ్లీలో చదివి వినిపించడంతోనే సందేహాలు మొదలయ్యాయి. 2017 జూన్ 30లోపు అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు, 2018 డిసెంబర్ 31లోపు 500 యూనిట్లకు పైగా విద్యుత్తును వినియోగించే వినియోగదారుల ఫీడర్ల వద్ద,
2019 డిసెంబర్ 31లోపు 200 యూనిట్లకుపైగా వినియోగించుకునే వారి ఫీడర్ల వద్ద స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఇ ఒప్పందంలో ఉందని చెబుతున్నారు సీఎం.గృహ, వ్యవసాయ వినియోగ విద్యుత్తుకు నూటికి నూరు శాతం మీటర్లు బిగిస్తామని సుస్పష్టంగా ప్రధాని మోదీ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని దాచిపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
మోటార్లకు మీటర్లు బిగిస్తే 30 వేల కోట్లు..
ఐతే ప్రభుత్వ ఆరోపణలు కొట్టిపడేస్తున్న బీఆర్ఎస్…. మోటార్లకు మీటర్లు బిగిస్తే 30 వేల కోట్లు అదనంగా రుణమిస్తామని చెప్పినా, తాము వదులుకున్నామని అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ వాదనను తోసిపుచ్చుతోంది. బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి గుదిబండలా మారిందని ఆరోపిస్తున్నారు.