ఇవాల్టి నుంచే రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్నదాతల అకౌంట్లలోకి రుణమాఫీ డబ్బులను జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తొలి విడతలో రూ.లక్షలోపు రుణమాఫీ జరగనుంది. ఇవాళ 11.50లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.లక్ష వరకు రుణమాఫీ డబ్బులు జరగనుంది. రుణమాఫీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికలు ఏర్పాటు చేశారు అధికారులు.
రైతు వేదికల దగ్గరకు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు హాజరుకానున్నారు. రుణమాఫీ నిధుల విడుదల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేపట్టనుంది. రైతులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓ పండుగలా సంబరాలు జరుపుకోవాలని ప్రభుత్వం సూచన చేసింది.