KAVITHA: లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యం బారిన పడ్డారు. మంగళవారం ఉన్నట్టుండి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కవితను దీన్ దయాల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
16/07/2024
ఈ రోజు ఉదయం బీజేపీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్ ఆధ్వర్యములో విధి కుక్కల వలన జరిగే ప్రమాదాల గురించి విన్నతి పత్రం మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడతూ మేడ్చల్ మున్సిపల్ ప్రతి గల్లీలో విధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్న పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదురవం చూస్తున్నాం కావున వాటి గురించి ప్రత్యిక శృద్ధ తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమములో మేడ్చల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి. లవంగ శ్రీకాంత్, బి జె వైఎం అధ్యక్షులు వంశీ వంజరి, బీజే వైఎం రాఘవరెడ్డి. మహేష్ గౌలీకర్, నరసింహ రెడ్డి ,సురేష్, శ్రీకాంత్ , మల్లన్న , సురేష్ ప్రభు , శివ,చంద్రమోహన్ , శ్రీనివాస్ , మనోజ్ కుమార్ పలు కాలని వసూలు పాల్గొన్నారు.
తెలంగాణలో రేవంత్ సర్కార్ నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరుపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. జూన్ 11న విచారణ పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్ తన అభిప్రాయం చెప్పేశారని సీఐజే వ్యాఖ్యానించారు. జడ్జి నిస్పక్షపాతంగా ఉండాలన్నారు. కమిషన్ చైర్మన్ ను మార్చే అవకాశం ఇస్తున్నామని ప్రభుత్వానికి తెలిపారు. కొత్త జడ్జి పేరును మధ్యాహ్నం 2 గంటలకు చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీంతో కాసేపట్లో కొత్త చైర్మన్ పేరు వెల్లడి కానుంది. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై హోరాహోరీగా వాదనలు జరిగాయి. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున సింఘ్వీ వాదనలు వినిపించారు. కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టడాన్ని సీఐజే తప్పుబట్టినట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ ఎలా పెడతారు? కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారు? అంటూ సీఐజీ ప్రశ్నించినట్లు సమాచారం
తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భావోద్వేగ ట్వీట్ చేశారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని తేల్చిచెప్పారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమని అభవర్ణించారు.
ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైన ఘనత అని అన్నారు. నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దేశ రైతాంగానికి, నేడు ప్రజాప్రభుత్వ పాలనలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ అందించే భరోసా అని చెప్పుకొచ్చారు. రుణమాఫీ అమలులో తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా, మలి అడుగు విధివిధానాల ఖరారు అని సీఎం తెలిపారు. ప్రజాప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని పేర్కొన్నారు. ‘ఇది రైతన్నకు.. మీ రేవంతన్న మాట’ అంటూ ముఖ్యమంత్రి మంగళవారం ట్వీట్ చేశారు.
సినీ నటుడు రాజ్ తరుణ్‌కు హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా రాజ్ తరుణ్‌కు ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కొత్త న్యాయచట్టం బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు ఇచ్చారు.
రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అతనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ 1గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రని పేర్కొన్నారు. మాల్వీ సోదరుడు తనను చంపేస్తానని బెదిరించాడని లావణ్య పేర్కొంది. వారిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
మరో హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్టే కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అయితే 42 కాస్తా తిరిగేసి 24గా మార్చేందుకు ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీ కులగణన చేసి, జనాభా శాతాన్ని తేల్చి వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
కానీ ఇతర రాష్ట్రాల్లో కోర్టు తీర్పులు రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా 50 శాతం దాటకుండా రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్, బీసీ కమిషన్ అధికారులతో జరిగిన సమావేశంలో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచి నా కోర్టులు ఆ రిజర్వేషన్లను కొట్టివేశాయి.
రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని స్ప ష్టం చేశాయి. రాజ్యాంగం ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చినందున బీసీలకు 24 శాతం కంటే ఎక్కువ సాధ్యం కాదని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఓటరు జాబితా ప్రకారం తేల్చాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు ప్రభు త్వం వచ్చినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నది.
ఓట రు జాబితా ఆధారంగా వేసిన లెక్కల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్‌ను ఆయా పంచాయతీ లు, మండలాలు, జిల్లాలను ప్రాతిపదిక తీసుకొని అమలు చేస్తారు. 50 శాతంలో మిగిలిన రిజర్వేషన్‌ను బీసీలకు కేటాయిస్తారు. దీని ద్వారా సగటున బీసీలకు 24 శాతం మించకపోవచ్చని సామాజిక వేత్త లు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేశారని గుర్తు చేస్తున్నారు.
గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్న గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశవర్కర్ల ద్వారా పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితాను ప్రామాణికంగా చేసుకొని లెక్కలు తీయనున్నారు. దీంతో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఉత్తి మాటే కానున్నదని బీసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే పంచాయతీలు, మండలాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు పూర్తిగా మారే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
రైతు రుణమాఫీకి రేషన్ కార్డ్ నిబంధనపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం వివరణ ఇచ్చారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీకి రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నట్లు తెలిపారు. కుటుంబం నిర్ధారణ కాగానే మిగతా వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని వివరించారు.
2018లో అవలంభించిన విధానాలనే ఇప్పుడు అమలు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన ఆరేడు నెలల్లోనే రూ.2 లక్షల రుణాన్ని ఏకకలంలో మాఫీ చేస్తున్నామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంపై బురదజల్లాలనుకోవడం సరికాదన్నారు.
రుణమాఫీ నిబంధనలు
– భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ.
– ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
– రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచ్‌ల నుంచి తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
– 12.12.2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తింపు.
– ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది.
– రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు లేదా రేషన్ కార్డు డేటా బేస్ ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు ఉంటారు.
– అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాల్లో జమ చేస్తారు. పీఏసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పీఏసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు.
– ప్రతి రైతు కుటుంబానికి 09.12.2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి.
– ప్రతి రైతు కుటుంబానికి 09.12.2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక రూ. 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది.
– ఏ కుటుంబానికి అయితే రూ.2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల రూ.2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
– రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.