మేడ్చల్ తహసీల్దార్ పై గిర్మాపూర్ కు చెందినవారు ప్రజాపాలనలో మంగళవారం ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలోని గిర్మాపూర్ కు చెందిన బాసురాది ఉమ సర్వే నెంబర్ 41లో 8 గుంటల భూమి తన వారసత్వంగా ఉందని తెలిపారు. తన భర్త మల్లేష్ తండ్రికి బాసురాది బాలయ్య, బాసురాది మల్లేష్, బాసురాది వీరయ్య ముగ్గురు కొడుకులు వారసురాలుగా ఉన్నారన్నారు. అందులో వారసత్వంగా ముగ్గురికి వాటా ఉండగా తహసీల్దార్ డబ్బులకు అమ్ముడుపోయి మల్లేష్, కృష్ణ చనిపోవడంతో కృష్ణ భార్య అయిన కళావతికి మొత్తం భూమిని పట్టాచేసి పాస్ బుక్కులు ఇచ్చారని ఆరోపించారు. గతంలో తహశీల్దార్ అభ్యంతరాలు తెలుపుతూ లిఖితపూర్వకంగా తెలియజేసిన పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ ను ప్రశ్నిస్తే పొరపాటు జగిందని, మేము ఇప్పుడు ఏమి చేయలేమని కోర్టుకు వెళ్లండని సలహాలు ఇచ్చారన్నారు. ఇద్దరు వారసులకు పట్టా చేసే సమయంలో మా కుటుంబ సభ్యులు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. తాను ఒంటరి మహిళని, రావాల్సిన వాటాకోసం కోర్టుల చుట్టూ తిరిగే స్థోమత లేదన్నారు. తనకు అన్యాయం చేసిన తహసీల్దార్ పై చర్యలు తీసుకొని, నాకు న్యాయంగా రావాల్సిన భూమిని ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు
09/07/2024
డీఎస్సీ వాయిదా పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు.. బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్
కేసీఆర్ ఫ్యామీలీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విద్యార్థుల చావుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. డీఎస్సీ వాయిదా పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు సీఎం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కేసీఆర్ 10 సంవత్సరాలలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ వేసింది లేదని విమర్శించారు. యువకులు మధ్యవయస్కులుగా మారిపోయారు అని అన్నారు. కోచింగ్ సెంటర్లను వెంటేసుకుని కేసీఆర్ హరీష్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు. తాము 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.4 రోజులుగా కేటీఆర్, హరీష్ రావు మోదీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. పరీక్షలు వాయిదా వేస్తే పేద నిరుద్యోగులు నష్టపోతారని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తాజాగా మరో అవార్డు దక్కింది. జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అతడు సొంతం చేసుకున్నాడు.
ఇక ఈ అవార్డు కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా పోటీ పడ్డారు. కానీ, వారిద్దరినీ అధిగమించి బుమ్రా అవార్డు దక్కించుకోవడం విశేషం. కాగా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆసాంతం ఈ స్టార్ పేసర్ అద్బుతంగా రాణించాడు. తద్వారా టీమిండియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో చివరి ఐదు ఓవర్లలో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన ఒక వికెట్ కూడా తీశాడు. మొత్తంగా టోర్నమెంట్లో 4.17 ఎకనామీ, 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. దాంతో అత్యుతమ గణాంకాలు నమోదు చేసినందుకు గాను అతనికి ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.
ఇది నాకు ప్రత్యేక గౌరవం: బుమ్రా
“జూన్ నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషం. అమెరికా, వెస్టిండీస్‌లో గడిపిన కొన్ని వారాలు ఎంతో చిరస్మరణీయం. ఆ తర్వాత నాకు ఇది ప్రత్యేక గౌరవం. జట్టుగా జరుపుకోవడానికి చాలా ఉంటాయి. కానీ, ఈ వ్యక్తిగత ప్రశంస ఎప్పటికీ ప్రత్యేకమే. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేయడం, జట్టు ట్రోఫీ గెలవడం చాలా ఆనందంగా ఉంది. చివర్లో ట్రోఫీ ఎత్తడం చాలా ప్రత్యేకమైంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను.
ఇక జూన్ నెలలో ఈ అవార్డు కోసం పోటీ పడ్డ రోహిత్, గుర్బాజ్‌కు నా అభినందనలు. చివరిగా నా కుటుంబ సభ్యులకు, నా సహచరులు, కోచ్‌లతో పాటు అభిమానులు నాకు ఓటు వేసినందుకు ధన్యవాదాలు. వారి మద్దతు ఎప్పటికీ మరిచిపోలేను” అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీలు సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దానిని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు.
ఆయారాం… గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఏపీలో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తోన్న రాహుల్ గాంధీ తెలంగాణలో మాత్రం తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే అన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్‌కు సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయ పత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తోందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, రుణమాఫీ హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుందని ఎద్దేవా చేశారు.
పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతినిస లోక్ సభ స్పీకర్‌ను కలుస్తామన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారని… ఆచరణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.
లోన్ యాప్ అప్పులు తీర్చడానికి రూ. 30 లక్షలకు కిడ్నీ అమ్ముకున్నాడు ఓ యువకుడు. ఈ దారుణమైన సంఘటనపై ఏపీలోని విజయవాడలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిడ్నీ తీసుకొని చేతిలో లక్ష పెట్టి యువకుడిని మోసం చేసింది విజయా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం.
ఇక గుంటూరు జిల్లాకు చెందిన మధుబాబు అనే యువకుడు లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేసి అవి తీర్చడానికి 30 లక్ష రూపాయలకి కిడ్నీ అమ్ముకున్నాడు. విజయవాడకు చెందిన విజయా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్లు మధుబాబు కిడ్నీ తీసుకుని లక్ష చేతిలో పెట్టి పొమ్మన్నారు.. ఇప్పుడు మధుబాబు ఆరోగ్యం క్షీణించి న్యాయం కోసం తిరుగుతూ, గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఈరోజు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 75 వన మహోత్సవం సందర్భంగా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ శ్రీమతి మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెట్లను పెట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే శ్రీహరి గారు, వైస్ చైర్మన్ దామన్న గారి ప్రభాకర్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, చింత పెంటయ్య,అమరం జైపాల్ రెడ్డి, అమరం హేమంత్ రెడ్డి,సాయి పేట శ్రీనివాస్, మరియు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు బట్టీకాడి దేవేందర్ ముదిరాజ్,ఆర్వో శ్రీనివాస్ గౌడ్ గారు, మున్సిపల్ హరితహారం ఇన్చార్జి నరసింహారెడ్డి గారు, మరియు బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
భారత మార్కెట్లోకి వోల్వో కార్ ఇండియా నుంచి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నాయి. వోల్వో లైనప్‌లో వోల్వో XC40 రీఛార్జ్, C40 రీఛార్జ్ వంటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (BEVs)విక్రయిస్తోంది. వోల్వో కార్స్ ప్రకారం.. భారత మార్కెట్లోకి మరో రెండు ఎలక్ట్రిక్ స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు (SUV), EX30, EX90లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
స్వీడిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ భారతీయ విభాగం మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ XC40 రీఛార్జ్ ట్విన్ మోటార్‌ను 2022లో విడుదల చేసింది. కంపెనీ రెండవ ఎలక్ట్రిక్ SUV,C40 రీఛార్జ్ ట్విన్ మోటార్‌ను 2023లో ప్రవేశపెట్టింది.
వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్ మోటార్ మార్కెట్లోకి ప్రవేశించింది. 2024 వోల్వో గత నెలలో భారత మార్కెట్లోకి 1,000 యూనిట్ల బీఈవీ విక్రయాల మైలురాయిని అధిగమించింది.
వోల్వో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కార్‌మేకర్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ డైరెక్ట్ సేల్స్ మోడల్‌ను ఉపయోగించి విక్రయిస్తుంది. 2030 నాటికి మొత్తం పోర్ట్‌ఫోలియోను ఎలక్ట్రిక్‌గా మార్చే లక్ష్యంతో కంపెనీ ప్రతి ఏడాదిలో ఒక బీఈవీ దేశ మార్కెట్లోకి విడుదల చేస్తుంది.
“మేం మా ఉత్పత్తులను వేగవంతం చేస్తున్నాం. వచ్చే ఏడాది (2025) EX30తో బయటకు వస్తాం. మా ఎలక్ట్రిక్ ఎస్యూవీ లైనప్‌కు కొత్తగా వచ్చి చేరుతుంది. వోల్వో EX30కి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో మంచి ఆదరణ లభించింది. భారత్‌లో కూడా మంచి ఆదరణ పొందుతుందని వంద శాతం నమ్మకం ఉంది’’ మీడియా సమావేశంలో పర్సన్ పేర్కొన్నారు
గోల్డ్ లవర్స్ ఇది మీకు ‘భలే మాంచి రోజు’.. భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా ధమాలన్నాయ్. గత మూడు రోజుల క్రితం ఒక్కసారిగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 710 మేరకు పెరగగా.. ఇప్పుడు అది రూ. 220కి తగ్గింది. స్థిరంగా కొనసాగుతూ.. తగ్గుతూ వస్తోంది పసిడి ధర. బంగారం కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి తరుణం. దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలో కాస్త వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 67,440గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73,570గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 67,590గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,720గా ఉంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,440 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,570గా ఉంది. బెంగళూరులో కూడా ఇదే ధర కొనసాగుతుండగా.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 67,990గా.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 74,170గా ఉంది.