బీహార్ రాష్ట్రం పాట్నాలోని ఎయిమ్స్ విశ్వవిద్యాలయం లో ఎం బి బి ఎస్ చదువుతున్న మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మర్రి దీపికా నరసింహారెడ్డి కూతురు డాక్టర్ మర్రి శ్రేయ రెడ్డికి అంతర్జాతీయ పర్యావరణ పురస్కారం లభించింది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల రోజులపాటు పర్యావరణ పరిరక్షణ పై వివిధ అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో శ్రేయ రెడ్డి తన ప్రతిభను కనపరిచి అగ్రస్థానంలో నిలిచారు. దీంతో శ్రేయ రెడ్డిని ఎంపిక చేసి ఎయిమ్స్ విసి నీలోత్పల్ బల్ చేతుల మీదుగా ప్రథమ స్థాయి పురస్కారం అందజేస్తూ గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు తమ కూతురు శ్రేయ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో పురస్కారం లభించడం సంతోషంగా ఉందని తల్లి, తండ్రులు మర్రి దీపిక నరసింహారెడ్డి,మర్రి నర్సింహా రెడ్డి లు అన్నారు
05/07/2024
గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డీఈవో విజయ కుమారి ,ఎంఈఓ లు వసంత కుమారి,శశిధర్ నీ కలెక్టరేట్ లో ఉన్న డిఈఓ ఆఫీసులో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది…
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ డిమాండ్…
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ…. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు వినతిపత్రం రూపంలో కలిసి ఇచ్చిన చర్యలు మాత్రం లేవని అధికారులకు తెలియజేశారు. విద్య అధికారులకు గుర్తింపు లేని విద్యాసంస్థల పేర్లు చెప్పిన పట్టించుకునే దుస్థితి లేదని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలల లో అనేకం గుర్తింపు లేని పాఠశాలలు విద్యా సంస్థలు ఉన్నాయని తెలియజేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్య అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే కార్పొరేట్ ప్రైవేటు యజమాలులు విచ్చలవిడిగా గుర్తింపు లేకుండా విద్యాసంస్థలు పెట్టి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్న విద్య అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. పదేపదే విద్య అధికారులకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో బుక్స్ యూనిఫామ్,బెల్టు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చర్యలు మాత్రం లేవు అని డిమాండ్ చేశారు. ఈరోజు కలిసినప్పుడు విద్య అధికారులు డీఈవో, ఎంఈఓ లు గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇప్పటికైనా ప్రైవేట్ కార్పొరేటు గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌పై ప్రియురాలు లావణ్య మోసం చేసిందని ఆరోపించింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడు వేరే వారితో జీవిస్తున్నాడని నర్సింహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్ కాల్ ఎత్తడం లేదని, అతని నంబర్ బ్లాక్ చేయబడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజ్‌తరుణ్‌తో నేను 11 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాను. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. ఇదిలా ఉంటే సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడు. ఆ తర్వాత నన్ను వదిలేశాడు. మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నన్ను కూడా సంప్రదించవద్దు. రాజ్‌ని వదిలేస్తే చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయి.
రాజ్ తరుణ్ నా ప్రపంచం. నాకు రాజ్ కావాలి. లావణ్య నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. గతంలో కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు వెల్లడించింది. తనను అరెస్టు చేసి 45 రోజులు జైలులో గడిపారని ఆమె చెప్పారు. అప్పుడు రాజ్ అతనికి సహాయం చేయలేదు.
మోహన్ బాబు వారసురాలిగా సినీపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ఆ తరువాత తనకంటూ పత్ర్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా, టీవీ షో హోస్ట్‌గా, నిర్మాతగా విజయాన్ని అందుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచులక్ష్మి ట్రోలర్ల విషయంలో దూకుడుగా ఉంటుంది. వాళ్ల తీరును ఎండగట్టేందుకు అసలేమాత్రం సంకోచించదు. అయితే, తాజాగా ప్రజల సాయం అర్థిస్తూ మంచు లక్ష్మి పెట్టిన పోస్టు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
‘‘నిరాశలో సహాయం కోసం వెయిట్ చేస్తున్నా. నా వీసా కోసం నెల క్రితం అప్లై చేశాను. కానీ ఇప్పటికీ నాకు అది రాలేదు. నా కుమార్తె పాఠశాల సెలవులు ముగుస్తున్నాయి. జులై 12న నా ఫ్లైట్ ఉంది. ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో, వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా సహాయం చేయగలరా?’’ అంటూ మంచు లక్ష్మి తన సమస్యను నెట్టింట పంచుకుంది.
మంచు లక్ష్మి పోస్టుకు జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. తమకు తెలిసిన వారి ఫోన్ నెంబర్లు షేర్ చేశారు. సెలబ్రిటీ అయ్యుండీ సామాన్యుల్ని సహాయం అడగడంపై మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏపీలో వైసీపీ నేతల అరెస్ట్. ఇటీవల ఎన్నికల హింసాత్మకంగా మాజీ ఎంపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు… ఇప్పుడు మరో మాజీ ఎంపీ సుధాకర్‌ను అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సుధాకర్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్ 6 రెడ్‌విత్ 5(ఎల్) కింద కేసు నమోదు చేశారు. సుధాకర్‌ను కర్నూలులోని ఆయన ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సుధాకర్‌ను కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సుధాకర్‌ను జిల్లా జైలుకు తరలించారు.
ఎన్నికలకు ముందు సుధాకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తన ఇంట్లో పనిచేసే యువతితో సుధాకర్ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమ్మాయి వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సుధాకర్‌కు వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేశారు. ఇప్పుడు ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయడమే కర్నూలులో హాట్ టాపిక్. మరోవైపు పలువురు టీడీపీ నేతలు కూడా సుధాకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి డి.సుధాకర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, ఆయనపై లైంగిక విమర్శల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఆయనకు 2024 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు.
2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో అద్భుతమైన బౌలింగ్ కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరం కాగా, బుమ్రా మ్యాజిక్‌ని కొనియాడాడు.
బుమ్రాను ప్రపంచంలోని ఎనిమిదో అద్భుతం, భారతదేశ జాతీయ సంపద అని పిలిపించే పిటిషన్‌పై మీరు సంతకం చేస్తారా అని అడిగినప్పుడు, విరాట్ కోహ్లీ సంకోచం లేకుండా అతను ఖచ్చితంగా సంతకం చేస్తానని చెప్పాడు. గురువారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని ప్రకటించాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని కొనియాడాడు.
“అందరి అభిమానుల్లాగే, ఒక సమయంలో మేము ఆట జారిపోతున్నట్లు భావించాము, కానీ చివరి ఐదు ఓవర్లలో ఏమి జరిగింది అనేది నిజంగా ప్రత్యేకమైనది.” అవసరమైనప్పుడు మమ్మల్ని మళ్లీ మ్యాచ్ రేసులోకి తీసుకురావడానికి బుమ్రన్ను అందరూ అభినందించాలని నేను కోరుకుంటున్నాను. చివరి ఐదు ఓవర్లలో బుమ్రా ఏం చేశాడో కూడా వారికి తెలుసు. “చివరి ఐదు ఓవర్లలో రెండు ఓవర్లు వేసిన ఆటగాడికి మీరందరూ (స్టేడియంలోని అభిమానులు) అభినందించాలి” అని బుమ్రా అన్నాడు.
భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లను సన్మానించేందుకు విజయోత్సవ పరేడ్, వేడుకలకు వచ్చిన అభిమానులకు కోహ్లీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కవాతు సందర్భంగా ముంబై వీధుల్లో చూసిన దృశ్యాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నాడు.
ఇంతలో, 2024 T20 ప్రపంచ కప్ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైనప్పుడు బుమ్రా తన మ్యాజిక్ చేశాడు. 2 ఓవర్లు వేసిన బుమ్రా 6 పరుగులు మాత్రమే ఇచ్చి నిర్ణయాత్మక వికెట్ తీసిన సంగతి తెలిసిందే.
రోజురోజుకు అక్రమ మట్టి తవ్వకాలు పెరిగిపోతున్నాయి. మట్టి మాఫియాతో లక్షల సంపాదనతో జేబులు నింపుకుంటున్నారు. గతకొంత కాలంగా మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని గిర్మాపూర్ దాతర్ చెరువులో వెంకట్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి సమయంలో అధికారుల కళ్ళు కప్పి హిటాచి పెట్టించి టిప్పర్ లలో అక్రమంగా నల్లమట్టిని ఇటుక బట్టీలలో రవాణా చేస్తున్నాడు. ట్రిప్పుకు 15 నుండి 20 వేలవరకు సంపాదనతో జేబులు నింపుకుంటున్నాడు. రాత్రి 12 గం.ల తరువాత హిటాచి పెట్టించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల కళ్ళు కప్పి అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. 12 గంటలనుండి ఉదయం 5 గంటలవరకు టిప్పర్లతో నల్లమట్టిని అక్రమంగా తరలిస్తున్నాడని గిర్మాపూర్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు