సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి అధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2024–25 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ స్కూళ్లల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల యజమాన్యాలకు సూచించారు.
డీఈఓ ఆదేశాలు జారీ చేయడం పట్ల సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎస్.డబ్ల్యుజెఎ) అధ్యక్షులు ఎం.సాయినాథ్,ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఉప అధ్యక్షులు,ఎర్ర వీరేందర్ గౌడ్, సలహాదారులు సునీల్, వసంత్ కుమార్, ట్రెజరర్ నాగభూషణం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సాయినాథ్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులో విద్యాధికారి ఇచ్చిన సర్కులర్ తో పాటు మీ యొక్క అక్రిడేషన్ కార్డు జతపరిచి మీ యొక్క పిల్లల చదువుతున్న స్కూల్లో సమర్పించ వలసిందిగా సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.