మేడ్చల్ : నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సిఐ హనుమాన్ గౌడ్ అన్నారు.శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద విగ్రహం వద్ద వాహనాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సిఐ హనుమాన్ గౌడ్ మాట్లాడుతూ 3 త్రిచక్ర,17 ద్వీచక్ర వాహనాలను నెంబర్ ప్లేట్ ప్రదర్శించని కారణంగా తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్నామన్నారు.వారిని కౌన్సిలింగ్ కోసం మాదాపూర్ లోని ట్రాఫిక్ ట్రెనింగ్ ఇన్స్టిట్యూట్ కు పంపిస్తామన్నారు.
ప్రతి వాహన దారుడు డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన పేపర్లు, హెల్మెట్ కచ్చితంగా వినియోగించాలని సూచించారు.తనిఖీ చేస్తున్న సమయంలో వాహనదారులు పోలీసులకు సహకరించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు.తనిఖీ లలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.