ఘట్కేసర్ మండల్ అనోజ్ గూడా దగ్గర ఉన్న నారాయణ కాలేజీలో విద్యార్థుల పెట్టెల తాళాలు పలు కొట్టి విద్యార్థుల మెమొలు, ముఖ్యమైన సర్టిఫికెట్ లు గందరగోళంగా మారినాయి. విద్యార్థులు వచ్చి మా పెట్టెలు దగ్గరికి మేము వెళ్ళాలి అంటే పంపియ్యకుండా విద్యార్థులు గొడవలు చేస్తే అప్పుడు విద్యార్థులను పంపిస్తే చెత్తకుండీలాగా మారిన పెట్టెలు పుస్తకాలు ఇదేంటి అని కళాశాల యజమాన్యానికి ప్రశ్నిస్తే మా కాలేజీలో పెట్టి పోతే ఇలానే ఉంటుంది అని విద్యార్థుల తల్లిదండ్రులతోటి అడ్డగోలుగా మాటలు…
విద్యార్థుల దగ్గర్నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థుల పుస్తకాలకు కూడా భద్రత లేనిది హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఎలా ఇవ్వగలరని ప్రశ్నిస్తున్నారు. నారాయణ కళాశాలలో విద్యా వ్యాపారమే తప్ప విద్యార్థుల చదువు కోసం కాదని హెచ్చరించారు. విద్యార్థుల పెట్టెలకు, టేబుల్ చేర్స్ లకు లేని భద్రత విద్యార్థులకు ఎలా ఉంటుందని ఇంటర్మీడియట్ అధికారులకు అడుగుతున్నాము అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు వెంటనే నారాయణ కళాశాల విద్యార్థులకు జరిగిన అన్యాయం పైన న్యాయం చెప్పాలని కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్