సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రాష్ట్రంలో రేపటి (గురువారం) నుండి నామినేషన్ల ప్రక్రియ షూరు కానుంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉండటంతో ఎన్నికలసంఘం 17 స్థానాలకు మే 13న ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికల ప్రక్రియలో
భాగంగా నామినేషన్లు వేయడానికి జిల్లా కలెక్టర్లను రిటర్నింగ్ అధికారులుగా నియమించి 17పార్లమెంట్ స్థానాలు ఉన్న జిల్లా కలెక్టరేట్ లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 18 నుండి నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేశారు. కాగా అభ్యర్థులు 18వ తేది గురువారం, 19వ తేది శుక్రవారం కావడం మంచి రోజులు ఉండటంతో నామినేషన్లు దాఖలు చేయడానికి పండితుల వద్దకు వెళ్ళి ముహుర్తాలు ఖరారు చేసుకుంటున్నారు.