భారత్ న్యూస్/మైదుకూరు
మైదుకూరు నియోజకవర్గం బిజెపి ఇన్చార్జిగా రైస్ మిల్ యజమాని ,వ్యాపారవేత్త, సంఘ సేవకుడు అయిన మాచునూరు సుబ్బరాయుడును బీజేపీ పార్టీ నియమించడం జరిగింది. నియామక పత్రాన్ని కడప జిల్లా బిజెపి ఇన్చార్జ్ కర్నాటి యాల్లారెడ్డి చేతుల మీదుగా సుబ్బరాయుడుకు అందజేశారు. యాల్లారెడ్డి గారు మాట్లాడుతూ అనతి కాలంలోనే సుబ్బరాయుడు పార్టీ కోసం చేస్తున్న కృషిని చూసి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాల మేరకు నియామకం చేయడం జరిగిందన్నారు. బిజెపి మైదుకూరు ఇన్చార్జ్ సుబ్బరాయుడు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మైదుకూరు నియోజకవర్గం లో బిజెపి శ్రేయోభిలాషులు ఉన్నారని వారందరినీ కలుపుకొని ,యువతను తీసుకొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పథకాలను వివరించి ,రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ పార్టీ ని ముందుకు తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బీపీ ప్రతాపరెడ్డి, రఘునాథరెడ్డి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.