టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల కారు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్లో ఆయన కారు డివైడర్ ను ఢీకొని మంటలు చెలరేగాయి. రిషబ్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్స్, అభిమానులు.. రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా తల్లి రిషబ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది. అయితే ఆమె ట్వీట్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రిషబ్ గురించి ఊర్వశి చేసిన ట్వీట్స్ గుర్తుచేస్తూ ఆమెను ట్రోల్ చేశారు.
ఓవైపు మీ గురించి మీడియాలో రూమర్స్.. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తరాకండ్ పేరును తీసుకువచ్చారు. మీకు సిద్ధ బలిబాబా విశేష ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. పంత్ కోసం అందరూ ప్రార్ధించండి ” అంటూ రిషబ్ ఫోటో షేర్ చేశారు మీరా. ఇక ఆమె పోస్ట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.మీ అల్లుడు బాగానే ఉంటాడు.. మీరు చింతించకండి.. అత్తగారి ప్రార్ధనలు ఎల్లప్పుడూ పనిచేస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఊర్వశి.. పంత్ గురించి ఉన్న అనుమానాలు క్లియర్ అయినట్టే అంటున్నారు. ఇక గతంలో ఊర్వశి రౌటేలా RP అంటూ చేసిన ట్వీట్స్ అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్పీ తనను కలవాడినికి ఒకప్పుడు గంటల తరబడి వెయిట్ చేసేవాడని చెప్పుకొచ్చింది ఊర్వశి.. అయితే ఆమె మాటలను పంత్ కొట్టిపారేశారు. ఇక ఇటీవల తాను చేసిన అన్ని ట్వీట్స్ కేవలం హీరో రామ్ పోతినేనిని ఉద్ధేశించి చేసినవంటూ ఊర్వశి చెప్పుకొచ్చింది. అయితే రిషబ్, ఊర్వశి గురించి వచ్చిన రూమర్లకు మాత్రం చెక్ పడలేదు.