ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు.. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ఇంటర్ పోల్ కు సీబీఐ లేఖ త్వరలో ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్ కార్నర్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉన్నట్లు గుర్తింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్లిపోయారు. తన అనారోగ్య కారణాలతో ఉన్నట్లుగా చెబుతూ వచ్చారు. ఆయన్ను ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ముందుగా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది.