నీట్, నెట్ పరీక్షలను రద్దు చేసి రీ ఎక్జామ్ నిర్వహించి, ఎన్ టీ ఏ సంస్థను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన సంఘాల ఆధవర్యంలో ఈ నెల 4న జరిగే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని
ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. విద్యార్థి సంఘాల జిల్లా నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజ్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరిపించి,
నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగేఎన్ టీ ఏను రద్దు చేసి, నీట్ విద్యార్థుల పట్ల ఎన్ డీ ఏ ప్రభుత్వ వైఖరినీ నిరసిస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ ను జయప్రదం చేయాలి ఆని పిలుపునిచ్చారు.
నీట్ పరీక్షలో పేపర్ లీక్ అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యాన్ని మరవకముందే మొన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన యుజీసి- ఎన్ఎటి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడాడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష లో మొత్తం 23 లక్షల 33 వేల 297 మంది, యుజీసి-ఎన్ఎటి పరీక్షలో మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, యుజీసి-ఎన్ఎటి రద్దు చేయడం వెనుక నీట్ అవకతవకలను మరిపించడం కోసమేననే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. నీట్, యుజీసి-ఎన్ఎటి పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జ్ తో న్యాయ విచారణ జరిపించాలని, పరీక్ష కుంభకోణంకు బాధ్యత వహిస్తూ వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని తెలిపారు. కేంద్ర పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకు అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల నుంచి ఇప్పటివరకు విద్యార్థి సంఘాల నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, యూనివర్సిటీలలో స్వేచ్ఛ వక్రీకరణ ప్రజాస్వామ్యం అణిచివేత చర్యలు ఆపాలి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలను రాష్ట్రాలకే నిర్వహించేలా అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులు లేరని పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వారు డిమాండ్ చేశారు. 4న జరిగే బంద్ ను విజయవంతంకై పాఠశాలల, కళాశాల యజమాన్యం సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐసిఐ శివాజీ నాయక్, ఏ ఎస్ ఎఫ్ అన్వర్ ఏఐఎస్ఎఫ్ హరీష్ జిల్లా ఉపాధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మనోజ్ తదితరులు పాల్గొన్నారు