తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను మరికాసేపట్లో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు రూ. 2.75 లక్షల కోట్లు. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ కంటే కొంత పెరిగే అవకాశం ఉంది. నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై నెలాఖరుతో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. దీంతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ దాదాపు రూ. 2.90 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించనున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.
అసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
నందినగర్‌లోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి బయల్దేరారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు.
- ప్రజాభవన్ నల్లపోచమ్మ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలురాష్ట్ర బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రవేశపెట్టనున్నారు. ఈనేపథ్యంలో ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
- ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి శాసనసభ సమావేశాలకు కేసీఆర్బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులూ అసెంబ్లీకి వెళ్లలేకపోయారు.ఈ నేపథ్యంలోనే సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తాజాగా తెలిపాయి. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో అధికార పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.