టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు చేసింది. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడమే కాకుండా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి గురువారం ఉదయం జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేశారు. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్ కు జానీ మాస్టర్ ను తీసుకొచ్చిన నార్సింగ్ పోలీసులు తొలుత రాజేంద్ర నగర్ డీసీపీ ఆఫీస్ కు ఆయన్ని తరలించారు. అనంతరం అక్కడ నుండి మరో రహస్య ప్రాంతానికి జానీ మాస్టారును తరలించి పోలీసులు విచారిస్తున్నారు. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు ఆయన్ని హాజరుపర్చనున్నట్టు తెలుస్తోంది.
0