కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇవాళ పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ ప్రారంభ వేడుక జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. తారక్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు.
ప్రస్తుతం ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. #ఎన్‌టీఆర్‌నీల్ హ్యష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ‘ఎన్‌టీఆర్ 31’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మూవీని ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.